Rajasaab: త్వరలోనే "రాజా సాబ్" టీజర్..! 19 d ago
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ది రాజా సాబ్" మూవీ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. మారుతీ తెరకెక్కించనున్న ఈ మూవీ టీజర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రం లో ప్రభాస్ కు జంటగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.